Skip to main content

గాజువాక 67వ వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఈటి గౌరీ మౌనిక నూతన డెంటల్ క్లినిక్‌ను ప్రారంభోత్సవమునకు ముఖ్యఅతిథిగా గాజువాక శాసనసభ్యులు , టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినారు

గాజువాక  67వ వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఈటి గౌరీ మౌనిక నూతన డెంటల్ క్లినిక్‌ను ప్రారంభోత్సవమునకు ముఖ్యఅతిథిగా గాజువాక శాసనసభ్యులు , టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినారు ప్రజలకు నాణ్యమైన మరియు ఆధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.ప్రాంతీయ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ క్లినిక్ ద్వారా సమయానుకూల చికిత్స, మెరుగైన వైద్య సదుపాయాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ ఈటి గౌరీ మౌనిక మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నేనెప్పుడూ ముందుంటానని, ఖర్చుతో కూడుకున్న వైద్యానికి కూడా నేను అతి తక్కువతో వైద్యశాల అందిస్తూ ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...