Skip to main content

సెయింట్ జోసెఫ్స్‌లో 68వ స్టూడెంట్ కౌన్సిల్ వీడ్కోలు వేడుకలు

సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ లో 68వ స్టూడెంట్ కౌన్సిల్ వీడ్కోలు వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ పి.డి తెలిపారు.

ఈ కార్యక్రమం శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థిని, ఆల్వర్దాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి పసుపులేటి లక్ష్మీ సుధ హాజరై విద్యార్థినులకు కళాశాల రోజుల్ని మధురస్మృతులుగా మార్చుకోవాలని, మంచి మనుషులుగా ఎదగాలని సూచించారు. విజయం అనేది వినయం మరియు నమ్రతలోనే ఉందని పేర్కొన్నారు. కుటుంబానికి, కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థినులకు సందేశం ఇచ్చారు. ఈ పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులను అభినందించారు.గౌరవ అతిథిగా డాక్టర్ కె. మాణిక్య కుమారి పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యతను, శాస్త్ర రంగాలలో మహిళల పాత్రను వివరించారు.అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ పి.డి వివరించారు.

ఈ సందర్భంగా కళాశాల వార్షిక పత్రిక “ద జోసెఫిన్ వాయిస్” ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎడిటర్ డాక్టర్ పి.కె. జయలక్ష్మి మాట్లాడుతూ 55 మంది విద్యార్థినులు, అధ్యాపకులు పత్రిక కోసం కథలు, కవితలు, వ్యాసాలు రచించారని, ప్రతి సంవత్సరం కళాశాల మేగజీన్ వెలువడుతుందని తెలిపారు.మిస్ సెయింట్ జోసెఫ్” పోటీలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంటర్మీడియట్ విభాగం నుండి కీర్తన, నందిని; డిగ్రీ విభాగం నుండి కీర్తన, నందిని; పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగం నుండి సిరివర్షిణి, ఆశ్రిత విజేతలుగా నిలిచారు.విజేతలకు ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు న్యాయనిర్ణేతలు డాక్టర్ పి.కె. జయలక్ష్మి, డాక్టర్ హరిణి చేత కిరీటాలు మరియు బహుమతులు అందజేశారు. ఇతర పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ముఖ్య అతిథి చేత పురస్కారాలు ప్రదానం చేయబడ్డాయి.అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినుల పాటలు, నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ హేమ, కౌన్సిల్ సలహాదార్లు డాక్టర్ సుజాత, సోనీ, డాక్టర్ మౌసమి, ప్రత్యూష, ప్రవీణ్, సిస్టర్ దీపాలి పాల్గొన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిందని ప్రెస్ ఇన్‌చార్జ్ డాక్టర్ పి.కె. జయలక్ష్మి తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...