విశాఖపట్నం మార్చి 3: నగరాభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మంగళవారం ఆయన అగనంపూడి జోన్ 77 వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో సుమారు రూ. 7.5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, వార్డ్ కార్పొరేటర్ బట్టు సూర్య కుమారి లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని మేయర్ తెలిపారు.
పెందుర్తి నియోజకవర్గం పరిధిలో అగనంపూడి జోన్ 77 వ వార్డులోని దువ్వాడ, పెట్టవానిపాలెం, ఇస్లాంపేట, మస్కాన్ దొడ్డి, మారదాసరిపేట పేట, పెదపాలెం, నమ్మిదొడ్డి, బొరుసువానిపాలెం, గొరుసు వానిపాలెం, లక్ష్మీ నగర్, పిలకవానిపాలెం, నక్కవానిపాలెం, తదితర ప్రాంతాలలో సుమారు రూ. 750.07 లక్షల వ్యయంతో తారు రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు,సిసి కల్వర్ట్లు, సిసి కాలువలు మొదలైనవి జీవీఎంసీ నిధులతో పెందుర్తి శాసనసభ్యులతో కలిసి శంకుస్థాపన చేసామన్నారు.
అనంతరం పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ నగర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పెందుర్తి నియోజకవర్గం లోని అన్ని వార్డులను సమదృష్టితో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పెందుర్తి నియోజవర్గం అగనంపూడి జోన్ 77 వ వార్డులో సుమారు 7. 50 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో , జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీరు, సహాయక ఇంజనీరు, పలువురు కూటమి నాయకులైన పి కనకారెడ్డి, శంకర్రావు, చిట్టిబాబు, పైడి రెడ్డి, రమణ, మంత్రి రవి, నూకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ.



Comments
Post a Comment