విశాఖపట్నం, మార్చి 1: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అగనంపూడి జోన్ ,వార్డు–79 లో దేశపాత్రునిపాలెం లో రూ.3.91 కోట్ల అంచనా వ్యయంతో 16 అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముందుగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరు కావడం జరిగింది అన్నారు. నగరంలో రహదారులు, కాలువలు, పారిశుధ్య సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా జీవీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అగనంపూడి జోన్ వార్డు-79 లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం 16 పనులు సుమారు రూ.391.52 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా
• జాజులవానిపాలెం ప్రాంతంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.34.20 లక్షలు
• సముదాయ భవనం వద్ద షెడ్, కాంపౌండ్ వాల్ మరియు ఇతర సౌకర్యాల ఏర్పాటు – రూ.19.76 లక్షలు
• అంబేద్కర్ వీధి సమీపంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.19.40 లక్షలు
• ఎస్.ఎస్. 2B-8 సమీపంలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.19.89 లక్షలు
• జీఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.90 లక్షలు
• వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టులు నిర్మాణం – రూ.19.96 లక్షలు
• శ్మశానవాటిక వద్ద బర్నింగ్ ప్లాట్‌ఫామ్, కాంపౌండ్ వాల్ తదితర సదుపాయాల ఏర్పాటు – రూ.32.72 లక్షలు
• వివిధ కాలనీలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టులు నిర్మాణం – రూ.38.92 లక్షలు
• దేశు సత్యనారాయణ గారి ఇంటి సమీపంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.96 లక్షలు
• శ్రీనివాస నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.68 లక్షలు
• బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.79 లక్షలు
• ఎస్.ఎస్.2B నుండి ఇతర ప్రాంతాల వరకు సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.92 లక్షలు
• బాలాజీ నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.82 లక్షలు
• బొమ్మరిల్లు ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.66 లక్షలు
• ఎస్.ఎస్.33 ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.79 లక్షలు
• వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మాణం – రూ.48.15 లక్షలు
ఈ పనులు పూర్తయిన తరువాత ఆయా ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి, జివీఎంసీ.

Comments
Post a Comment