సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు సువర్ణ అవకాశం... 8వ తేదిన రామచంద్రపురంలో నిరుద్యోగ మహిళలకు భారీ జాబ్ మేళా....
కార్పొరేట్ కంపెనీల్లో అవకాశాలు (వార్షిక వేతనం రూ. 1.8 లక్షల నుంచి 2.4 లక్షలు):
అర్హతలు: 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండి.. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన స్త్రీ అభ్యర్థులు అర్హులు.
కంపెనీలు: టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, విస్ట్రన్, రేమండ్స్, మదర్సన్, టీసీఎల్, నియో లింక్, ఫాక్స్ లింక్.
పనిచేయాల్సిన ప్రాంతాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరుపతి.
స్థానికంగా ఉపాధి అవకాశాలు (నెలసరి వేతనం రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు):
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, మండపేట, రామచంద్రపురం) పరిధిలో పనిచేయడానికి పలు లోకల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వివరాలు:
కిమ్స్ హాస్పిటల్ : 25 ఏళ్ల లోపు వయసు, టెన్త్ చదివి జీడీఏ సర్టిఫికెట్ ఉన్నవారికి 'జీడీఏ అసిస్టెంట్' పోస్టులు. 30 ఏళ్ల లోపు ఉండి జీఎన్‌ఎం , బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి 'స్టాఫ్ నర్స్' పోస్టులు.
షాపింగ్ మాల్స్: 30 ఏళ్ల లోపు వయసు ఉండి టెన్త్ చదివిన వారు మోర్, విజేత, విశాల్, డి-మార్ట్, విక్టరీ బజార్, వసుధ, క్రోమా, ట్రెండ్స్ వంటి మాల్స్‌లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అపోలో ఫార్మసీ: 35 ఏళ్ల లోపు వయసుండి బీ-ఫార్మసీ, డి-ఫార్మసీ చదివిన వారు ఫార్మసిస్టు పోస్టులకు అర్హులు.
పెట్రోల్ బంకులు: 50 ఏళ్ల లోపు వయసు ఉండి కనీసం 10వ తరగతి చదివిన మహిళలు.. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ రిటైల్ పెట్రోల్ బంకుల్లో కస్టమర్ అటెండెంట్‌గా పని చేయడానికి ఇంటర్వ్యూకు హాజరుకావచ్చునని తెలియజేశారు.

Comments
Post a Comment