బుధవారం ఆయన పెందుర్తి జోన్ 96 వ వార్డు పరిధిలోని సుమారు రూ.491.27 లక్షలతో పబ్లిక్ వర్క్స్, సుమారు రూ.153.37 లక్షలతో తాగునీటి పైప్లైన్లు మార్పు పనులకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. పెందుర్తి పరిధి లో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, నేడు సుమారు రూ.644.64 లక్షల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మాణం కు శంకుస్థాపన, జన చైతన్య లేఔట్ వద్ద తారు, సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, దొగ్గవానిపాలెం ఓల్డ్ విలేజిలో సిసి రోడ్డు, కాలువలు ప్రారంభోత్సవం , పెందుర్తి బ్రిడ్జి నుండి గొర్లి వారి కల్లాల వరకు తారు రోడ్డు ప్రారంభోత్సవం, దొగ్గవానిపాలెం కాలనీ లో సిసి రోడ్లు, కాలువలు ప్రారంభోత్సవాలు,ప్రసాద్ నగర్ లో పార్క్ నిర్మాణం, దొగ్గవానిపాలెం లో కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం శంకుస్థాపన,
గొర్లివారికాలనీ ప్రాంతాలలో పైప్ లైన్ పనులు, హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ పద్ధతిలో ప్రతిపాదిత 450 MM వ్యాసం గల MS కేసింగ్ పైపు, 250 MM వ్యాసం గల క్యారియర్ పైపు ఏర్పాటు , పెందుర్తి జంక్షన్ నుండి రైల్వే గేట్ ప్రాంతం వరకు 250 MM వ్యాసం గల HDPE పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయుట, గోర్లివాని కాలనీలోని జనచైతన్య లేఅవుట్ నుండి ఏకలవ్య కాలనీ వరకు పైప్‌లైన్లను ప్రారంభోత్సవం పెందుర్తి శాసనసభ్యులతో కలిసి చేసామన్నారు.
అనంతరం పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, పెందుర్తి నియోజకవర్గం లోని అన్ని వార్డులను సమదృష్టితో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పెందుర్తి పరిధిలోని 96 వ వార్డులో సుమారు 6.45 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసామని, శంకుస్థాపన చేసిన అభివృద్ది పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసి ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్. శంకర్రావు, జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీరు దిలీప్, సంతోష్ కుమారి, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వీరయ్య, కార్యనిర్వహక ఇంజనీరులు రాజశేఖర్, శివ లతోపాటు వేగి దివాకర్, వేగి పరమేశ్వరరావు, పి. రాజేంద్రప్రసాద్, కిల్లి రమేష్, సేనాపతి శేఖర్, పీలా జితేంద్ర, ఆళ్ల రమేష్, నాయుడు , శరగడం బుజ్జి, జీవీఎంసీ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.

Comments
Post a Comment