Skip to main content

రేపు నక్కపల్లి AMNS స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొననున్న కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ.

విశాఖపట్నం, మార్చి 22: సోమవారం నక్కపల్లిలో జరగనున్న దేశంలోనే అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్' (AMNS) ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొనేందుకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖపట్నం చేరుకున్నారు.

 నక్కపల్లిలో 1.35 లక్షల కోట్లతో నూతనంగా నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ లు పాల్గొన్నన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్' (AMNS) ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అంతకు ముందు ఉభయ మంత్రులు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ (RINL)ను సందర్శించి ప్లాంట్ పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...