Skip to main content

కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవేరుల కళ్యాణోత్సవాలు.



విశాఖ పట్నం వన్ టౌన్ ప్రాంతంలో గల కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఫిబ్రవరి 27వ తేది నుండి మార్చి 5వ తేదీ వరకు  జరుగుచున్న  నగరేశ్వరస్వామి  మరియు జనార్ధనస్వామి దేవేరుల పరిణయ మహోత్సవముల్లో భాగంగా ఆదివారం నాడు ఆలయంలో  దేవేరుల కళ్యాణ ఘట్టములు మిక్కిలి ఆధ్యాత్మిక భావంతో నిర్వహించినట్లు 

దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి దోమావెంకట బాలాజీ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

*శ్రీ నగరేశ్వరస్వామి - వింధ్య వాసిని* మరియు *శ్రీ జనార్ధనస్వామి - కోన కమలాదేవి* ల పరిణయ కార్యక్రమం యావత్తు శైవాగమ విద్వాన్ శ్రీ చంద్రమౌళి ప్రభాకర సత్యనారాయణ శర్మ మరియు చంద్రమౌళి మల్లీశ్వరి శర్మ గార్ల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాంబిల్లి బుచ్చి భాస్కర కుమారశర్మ గారి నేతృత్వంలో శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు పరిణయ మహోత్సవముల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు శ్రీ  సుగ్గు విజయకుమార్ మరియు పెంటపాటి సోమరాజు  తెలిపారు.

      పూసర్ల సురేష్ కుమార్ దంపతులు కంకణధారణ గావించి జిరిపిస్తున్న ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఉదయం అవపోసన, బలిహరణ, ఈశ్వరాభిషేకం, సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పం మరియు సాయంత్రం సదస్యం, అష్టోత్తరపూజ, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.



 *పరియణాల నేపధ్యం* :


దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆర్ బి బి కుమార్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వము ఆర్యవైశ్య ఋషులు చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు  ఆర్యవైశ్యుల నివసించు నగరంలో నగరేశ్వరుడు మరియు వింధ్యవాసిని గాను మరియు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి లు జనార్ధన స్వామి, కోన కమలాదేవి గా వెలసి ఆర్యవైశ్యులందరినీ రక్షించగలమని వరమొసంగిరి.

ఆ కారణము చేత ప్రతి కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో మాత్రమే ప్రతీ సంవత్సరం శివపార్వతులు మరియు విష్ణుమూర్తి లక్ష్మీదేవి లకు  ఏక కాలంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి వారం రోజులపాటు వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు.  కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో మాత్రమే శివకేశవులకు ఒకేసారి వివాహమహోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.


కార్యక్రమంలో నగరంలోని ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...