Skip to main content

గ్యాస్ సరఫరాపై అపోహాలు వద్దు : జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి....

 అమలాపురం, విశాఖ సందేసం...ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై కొన్ని అపోహలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయని వాటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని డా బిఆర్ అంబేద్కర్ కొనసీమ  జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి ఒక  ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. కోనసీమ జిల్లాకు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఏ విధమైన కొరత లేదని యధావిధిగా సరఫరా ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు గ్యాస్ కొరత వస్తుందని ఉద్దేశంతో వెంట వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని కేవలం 21 రోజులు గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఆసుపత్రి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని ఆమె స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం, అంగన్వాడి కేంద్రాలు సంక్షేమ వసతి గృహాలకు గ్యాస్ నిలుపుదల చేసినట్లు ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె వెల్లడించారు. గ్యాస్ బుకింగ్ పోర్టల్ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాబడి బుకింగ్లు నిలిచిపోయాయని తదుపరి యధావిధిగా పని చేస్తోందన్నారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...