జవాన్ నాగబాబు సేవలు మరువలేనివి : ఎంపీ హరీష్ మాధుర్..... అమర జవాన్ నాగబాబుకు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఘన నివాళి...
అల్లవరం, విశాఖ సందేసం...దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అమర జవాన్ బడుగు నాగబాబు సేవలు చిరస్మరణీయమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన నాగబాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో నిర్వహించిన నాగబాబు సంతాన సభలో ఎంపీ హరీష్ మాధుర్ పాల్గొని జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాగబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమారు 24 ఏళ్ల పాటు భారత సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన నాగబాబు మృతి చెందడం కోనసీమ ప్రాంతానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నాగబాబు కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో, దేశానికి సుదీర్ఘ కాలం సేవలందించిన జవాన్‌కు అంత్యక్రియల సమయంలో దక్కాల్సిన అధికార లాంఛనాలు, గౌరవ వందనం విషయంలో జరిగిన జాప్యంపై ఎంపీ హరీష్ మాధుర్ అసహనం వ్యక్తం చేశారు. సైనికుల పట్ల గౌరవం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరావు, గంధం పల్లంరాజు, స్థానిక నాయకులు, జనసేన, టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమర జవాన్‌కు నివాళులు అర్పించారు.

Comments
Post a Comment