మొల్ల మాంబ తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు మరువలేనివి : సర్పంచ్ పెనుమాల సునీత బండారులంకలో ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
అమలాపురం,, విశాఖ సందేసం..తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందించిన మహా కవయిత్రి ఆతుకూరి మొల్ల మాంబ జయంతి సందర్భంగా శుక్రవారం అమలాపురం మండలం బండారులంక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పెనుమాల సునీత అధ్యక్షతన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ ఆమె రచించిన మొల్ల రామాయణం ద్వారా సులభమైన తెలుగు భాషలో రామాయణాన్ని ప్రజలకు అందించి సాహిత్యానికి చిరస్థాయి కీర్తిని తీసుకొచ్చారనీ అన్నారు.ఆమె స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment