Skip to main content

ఆహ్లాదకర వాతావరణంలో గాజువాక ఇఫ్తార్ విందు… ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయిక మధ్య కోలాహలంగా సాగిన వేడుకలు* *▪️ చంద్రబాబు నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి కొత్త దిశ… ప్రతి వర్గానికి అండగా కూటమి ప్రభుత్వం* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు*

విశాఖపట్నం, మార్చి 20:* గాజువాక క్లబ్ (జగ్గు జంక్షన్ సమీపంలో) వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా, కోలాహలంగా జరిగింది. సుమారు 1000 మంది ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయంగా కలిసిమెలిసి ఈ పవిత్ర వేడుకను జరుపుకున్నారు.

ఇఫ్తార్‌కు ముందు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో భాగంగా ప్రార్థనలు నిర్వహించి, ఖురాన్ పారాయణం చేశారు. సూర్యాస్తమయం అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఖర్జూరం, నీటితో ఉపవాస విరమణ చేసి, ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు పంచుకుంటూ స్నేహభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, ఆర్థిక స్వావలంభనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ఎప్పటినుంచో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

 *మైనార్టీ సంక్షేమంలో టీడీపీ ప్రత్యేక చరిత్ర* 

1983 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేనంతగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని పల్లా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్‌ల నిర్మాణం, హజ్ యాత్రకు రాయితీలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మైనార్టీ నాయకులను చట్టసభలకు పంపించి వారి గొంతును వినిపించేలా చేసిన పార్టీ టీడీపీదేనని అన్నారు.

 *కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు అండగా సంక్షేమం* 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తోందని పల్లా తెలిపారు. కేవలం 19 నెలల్లోనే ఇమామ్, మౌజమ్‌లకు రూ.180 కోట్లు అందజేసిందన్నారు. మసీదులు, స్మశానాల అభివృద్ధికి నిధులు కేటాయించామని, నేషనల్ మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.300 కోట్ల రుణాలు అందిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో రొట్టెల పండుగకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.



నూర్ బాషా, దూదేకుల వర్గాల కోసం రూ.100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, 27 వేల మంది మైనార్టీ ఆటో డ్రైవర్లకు రూ.41.37 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అబుల్ కలాం ఆజాద్ అవార్డుల మొత్తాన్ని పెంచినట్లు తెలిపారు.

భారీ బడ్జెట్ కేటాయింపులు… ప్రతి రంగంలో ప్రాధాన్యం* 

2025-26లో రూ.5,434 కోట్లు, 2026-27లో రూ.6,090 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించామని పల్లా తెలిపారు. మైనార్టీ సబ్ ప్లాన్, స్వయం ఉపాధి, హజ్ యాత్ర, ఉర్దూ అకాడమీ, విద్యా అభివృద్ధి, కోచింగ్ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని వివరించారు. హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం అందిస్తూ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

‘తల్లికి వందనం’ ద్వారా లక్షలాది మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. ఇమామ్‌లను ఖాజీలుగా నియమించే ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు

జగన్ హయాంలో మైనార్టీలకు ద్రోహం* జగన్ రెడ్డి పాలనలో మైనార్టీ సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయని పల్లా విమర్శించారు. టీడీపీ తీసుకొచ్చిన 11 పథకాలను రద్దు చేసి, షాదీఖానాలు, మసీదులు, ఈద్గాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు సరైన నిధులు ఇవ్వలేదని, వక్స్ భూముల ఆక్రమణలను పట్టించుకోలేదని తెలిపారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు జరిగినా చర్యలు తీసుకోలేదని, మైనార్టీల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పల్లా మండిపడ్డారు.

మైనార్టీల సాధికారతే లక్ష్యం* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మైనార్టీల ఆర్థిక, సామాజిక, విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పల్లా స్పష్టం చేశారు. ప్రతి ముస్లిం కుటుంబం అభివృద్ధి చెందేలా, స్వావలంబన సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...