కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రైతులకు స్వర్ణయుగం: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు...... అన్నదాతలకు ‘అన్నదాత సుఖీభవ’తో మేలు... అల్లవరంలో ‘అన్నదాత సుఖీభవ’ మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమం...
విశాఖ సందేసం...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రైతులకు స్వర్ణయుగమని అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులకు మేలుజరుగుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అల్లవరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యతిధిగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలను ఎమ్మెల్యే రైతులతో కలిసి వీక్షించారు.
అనంతరం నియోజకవర్గ రైతులకు కేటాయించిన పెట్టుబడి సాయం మెగా చెక్కును ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా రూ. 20,000 పెట్టుబడి సాయం అందిస్తూ రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న రూ. 1600 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు. అమలాపురం నియోజకవర్గంలోని 13,403 మంది రైతులకు 7 కోట్ల 85 లక్షల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవ్వడం శుభపరిణామన్నారు. రైతులకు యంత్రాల పంపిణీ, ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీలు ఇలా ప్రతి అడుగులోనూ రైతు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నామని
ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణ బాబు, అల్లాడ సోంబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, దెందుకూరి సత్తిబాబు రాజు, కె.వి, దాట్ల గోపిరాజు, నీచ్చేనకోళ్ల మౌనిక, అధికారి జయలక్ష్మి, చిల్లా జగదీశ్వరి, కంకిపాటి గోపి, గుబ్బల రామ్ ప్రసాద్, కంకిపాటి వీరబాబు, పశ్చిమాల ఏడుకొండలు, గుబ్బల నాగేశ్వరావు, ముత్యాల బాబి, బొక్క ప్రసాద్, మామిడిశెట్టి శ్రీరామ్, లూటుకుర్తి చిన్నా,ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.



Comments
Post a Comment