Skip to main content

అయ్యరక జాతీయ మహిళా శక్తి ఉగాది పురస్కారాలు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.

అయ్యరక జాతీయ మహిళా శక్తి ఉగాది పురస్కారాలు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయ్యరక జాతీయ ప్రధాన కార్యదర్శి పేదిరెట్ల రాజశేఖర్ పాల్గొన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు అధ్యక్షతన అయ్యరక జాతీయుల్లో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేస్తూ నిరంతరం సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న మహిళలను ముఖ్య అతిథులు కుల పెద్దల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాది కర్రీ స్వాతి లత ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి లత  మాట్లాడుతూ  మొదటి ఉపాధ్యాయునురాలిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితిలో నిలబెట్టే అదృష్టం భగవంతుని కల్పించాడని, న్యాయవాద వృత్తిలో కూడా ఎంతోమంది పేద మహిళలకు సేవ చేసే అదృష్టం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో అయ్యరక జాతికి గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని,తనను గుర్తించి సత్కరించడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.చక్కటి గౌరవాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.తనను ప్రోత్సహిస్తున్న భర్త  కరి నారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...