వైద్యుల ప్రకారం, చాలా మంది వ్యాక్సిన్లు చిన్నపిల్లలకు మాత్రమే అవసరం అని భావిస్తారు. అయితే మహిళలు కూడా తమ జీవితంలోని వివిధ దశల్లో కొన్ని ముఖ్యమైన టీకాలు తీసుకోవడం ద్వారా అనేక ప్రమాదకరమైన వ్యాధులను నివారించవచ్చు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని గైనకాలజీ నిపుణులు తెలిపారు.
సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో ఒకటిగా ఉండగా, సమయానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వారు వివరించారు. సాధారణంగా 9 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మరియు యువతులు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచించారు.
అదేవిధంగా గర్భిణీ మహిళలు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు తెలిపారు. గర్భధారణ సమయంలో టిటానస్ వంటి టీకాలు తీసుకోవడం ద్వారా తల్లి మరియు శిశువును కొన్ని ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షించవచ్చని చెప్పారు.
మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు మరియు వ్యాక్సిన్లు తీసుకోవాలని వైద్యులు సూచించారు. మహిళల ఆరోగ్యం కుటుంబం మరియు సమాజ ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో Dr కిరణ్మయి, Dr వినీల, Dr తనూజ, Dr శాంతి, Dr సౌమ్య, డైటీషన్ శ్రావ్య మరియు సెంటర్ హెడ్ Dr అరుణ్ కుమార్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సూచనలు తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని వైద్యులు తెలిపారు.

Comments
Post a Comment