Skip to main content

బోడసకుర్రులో భేటీ బచావో - భేటీ పడావో బుర్ర కథ....

అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ   సర్పంచ్  రొక్కాల విజయలక్ష్మి  అధ్యక్షతన భేటీ బచావో - భేటీ పడావో బుర్ర కథ కార్యక్రమం శుక్రవారం  నిర్వహించారు.  సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలను రక్షిద్దాం-బాలికలను చదివిద్దాం, బాలల హక్కులు మరియు చట్టాలు లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరం అని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం మరియు సామాజిక రుగ్మత, ఇవి చదువును ఆపివేసి, బాలికల ఆరోగ్యం, హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తాయని వివరించారు

ఈ  కార్యక్రమంలో అరవ చంటి, దొమ్మేటి రాధాకృష్ణ, మొయిల గణపతి, అయిల శంకరం, ఇంచార్జ్ పంచాయితీ కార్యదర్శి చిట్టిబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామ్, గ్రామపంచాయతీ స్టాఫ్, సచివాలయం స్టాఫ్, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...