Skip to main content

వ‌సుదైక కుటుంబానికి నిద‌ర్శ‌నంగా ఏయూ - ఐక్య‌త‌, వైవిధ్య‌త‌లు మ‌న బ‌లం - శాంతి, సుస్థిర‌త‌కు యువ‌త పాటు ప‌డాలి

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, మార్చి 26:
వ‌సుదైక కుటుంబానికి నిద‌ర్శ‌నంగా ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం నిలుస్తోంద‌ని అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ విజ‌య కృష్ణ‌న్ అన్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా బీచ్‌రోడ్డులోని క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా గురువారం సాయంత్రం నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావ‌రిని ఆమె  ప్రారంభించారు. 

ఏయూ శ‌తాబ్‌ధి ఉత్స‌వాల‌లో తాను పాల్గొన‌డం ఎంతో ఆనందాన్ని ఇస్తోంద‌న్నారు. అనంత‌రం విజ‌య కృష్ణ‌న్‌ మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్ర‌తిష్ట‌కు నిద‌ర్శ‌నంగా నేడు మీ రంతా ఇక్క‌డ విద్య‌ను అభ్య‌శించ‌డం నిలుస్తుంద‌న్నారు.   విద్య రంగంలో ఏయూ ఒక విలువైన రంత్నంగా విరాజిల్లుతోంద‌న్నారు. ఐక్య‌త‌, వైవిధ్య‌త‌లే మ‌న బ‌ల‌మ‌ని చెప్పారు. యువ‌త‌రం శాంతి, సుస్థిర‌త‌కు పాటు ప‌డాల‌ని సూచించారు. ఏయూ అత్య్తుత్త నాణ్య‌త ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందిస్తోంద‌న్నారు. ప్ర‌పంచం నేడు అనుసంధానించ‌బ‌డింద‌ని, విభిన్న దేశాల సంస్కృతులు పంచుకుంటూ, సామ‌ర‌స్య జీవ‌నం సాగించాల‌న్నారు.అంత‌ర్జాతీయ విద్యార్థులు త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించే వేదిక‌గా దీనిని తీర్చిదిద్దిన ఏయూ అధికారుల‌ను అభినందించారు. నృత్యం, సంగీతం, క‌ల‌ల‌కు నిద‌ర్శ‌నంగా ఈ వేదిక నిల‌వాల‌ని ఆకాంక్షించారు.

ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఏయూ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌లో ఇది ఒక‌టిగా నిలుస్తుంద‌న్నారు. కొద్ది రోజుల క్రితం నిర్వ‌హించిన ఫుడ్ ఫెస్టివ‌ల్‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింద‌న్నారు. అదే విధంగా అంత‌ర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్స‌వానికి సైతం మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. విద్యార్థులు త‌మ క‌ళ‌ల‌ను, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు అందిస్తార‌న్నారు.అంత‌ర్జాతీయ విద్యార్థి వ్య‌వ‌హారాల డీన్ ఆచార్య పాల్ డ‌గ్ల‌స్ మాట్లాడుతూ 57 దేశాల‌కు చెందిన 1150 మంది విద్యార్థులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌శిస్తున్నార‌న్నారు.  కార్య‌క్ర‌మంలోఅసోసియేట్ డీన్‌లు ఆచార్య ఎన్‌.ఎం యుగంధ‌ర్‌, ఆచార్య విజ‌య‌శాంతి, ప‌లువురు ఆచార్యులు, డీన్‌లు, 

విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంర‌తం విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన నృత్యాలు ఎంత‌గానో అల‌రించాయి. ప్ర‌త్యేక వ‌స్త్ర‌ధార‌ణ‌ల‌తో, ఆక‌ట్టుకునే ఆహార్యంతో త‌మ దేశ సంస్కృతిని, సాంప్ర‌దాయాలు, నృత్య రీతుల‌ను ప‌రిచ‌యం చేస్తూ నిర్వ‌హిచిన కార్య‌క్ర‌మం ఆద్యంతం అల‌రించింది

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...