అమలాపురం, విశాఖ సందేసం....పేరూరు గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, నాలుగు సచివాలయాల సిబ్బంది సాక్షిగా పేరూరు గ్రామ పంచాయతి ఉప సర్పంచ్ కూడుపూడి సత్యనారాయణ (డ్రాయింగ్ మాస్టర్ ) ఆవేదన వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ కూడుపూడి సత్యనారాయణ మాస్టారు, పాలకవర్గం సభ్యుల పదవి కాలం త్వరలో ముగుస్తుందునా పంచాయతీ కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో అభినందన సభను ఉప సర్పంచ్ వేదికగా చేసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ అయిన నా వార్డు ప్రజలకు సేవా చేసేందుకు నేను ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారని అన్నారు. అనంతరం సర్పంచ్ దంపతులు దాసరి అరుణ డేవిడ్, ఉప సర్పంచ్ కూడుపూడి సత్యనారాయణ మాస్టారు, పాలకవర్గం సభ్యులను పంచాయతీ సిబ్బంది, సచివాలయల సిబ్బంది పూలమాలలు వేసి దుస్సాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, ఉద్యోగ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దొంగ ఆంజనేయులు, వాసంశెట్టి శ్రీనివాస్, చొల్లంగి సుబ్బిరామ్, సుధా గణపతి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment