Skip to main content

మాట ఇచ్చాం… అమలు చేశాం… ఉగాది రోజునే జాబ్ క్యాలెండర్ విడుదల* *▪️ జాబ్ క్యాలెండర్‌తో యువతకు భరోసా…* *▪️ సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ‘బ్రాండ్ ఆంధ్ర’గా రాష్ట్రం అవతరణ* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు*

అమరావతి, మార్చి 19:* తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ గారి నిరంతర కృషి, పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు.

యువత భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చారిత్రాత్మక నిర్ణయమని పల్లా అన్నారు. 10,060 పోస్టులతో ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఏఈఈ తదితర విభాగాల్లో భారీ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంలో లోకేష్ గారి కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు.

 *6.28 లక్షల ఉద్యోగాలు… ఉపాధి సృష్టిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది* 

జాబ్ క్యాలెండర్‌కు ముందే కూటమి ప్రభుత్వం మొత్తం 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని పల్లా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, MSME రంగంలో 2,48,906, జాబ్ మేళాలు & స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 1,46,627, పరిశ్రమల్లో 95,174, ఫుడ్ ప్రాసెసింగ్‌లో 64,035, ఐటి & ఎలక్ట్రానిక్స్‌లో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు సృష్టించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

 *‘తల్లికి వందనం’ నుంచి ‘స్త్రీ శక్తి’, ‘దివ్యాంగ శక్తి’ వరకు… సంక్షేమంలో సువర్ణ అధ్యాయం* 

చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమానికి కొత్త నిర్వచనం తీసుకువచ్చామని పల్లా పేర్కొన్నారు.

‘తల్లికి వందనం’ ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షలకుపైగా తల్లుల ఖాతాల్లో జమ చేసి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు.


‘స్త్రీ శక్తి’ ద్వారా 43 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించి రూ.1,532 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అదేవిధంగా ‘దివ్యాంగ శక్తి’ కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, వారి జీవనంలో గౌరవం, స్వావలంబన పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పల్లా పేర్కొన్నారు. ‘దీపం-2’ ద్వారా 3.64 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.2,891 కోట్లు వ్యయం చేశామని తెలిపారు.

‘అన్నదాత సుఖీభవ’ ద్వారా 46 లక్షల రైతులకు రూ.6,310 కోట్లు, పింఛన్ల రూపంలో 63 లక్షల మందికి రూ.58,654 కోట్లు అందించామని చెప్పారు. మత్స్యకారులకు రూ.250 కోట్లు, ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు అందించడం ద్వారా ప్రతి వర్గానికి అండగా నిలిచామని తెలిపారు. అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు అందించామని చెప్పారు. అదేవిధంగా ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లు, అర్చకులకు గౌరవ వేతనాలు పెంచి అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని చాటామని అన్నారు.

 *మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం* 

ఇమామ్, మౌజమ్‌లకు రూ.180 కోట్ల మద్దతు, రూ.45 కోట్ల విడుదల, బడ్జెట్‌లో రూ.6,090 కోట్ల కేటాయింపుతో మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం కూటమిదేనని పల్లా స్పష్టం చేశారు.

 *మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు* 

రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, రూ.3,000 కోట్లతో కొత్త రహదారులు, గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టులు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

 *విద్య, వైద్యం, డిజిటల్ పాలనలో నూతన దిశ* 

విద్యా రంగంలో సంస్కరణలు, టీచర్ల నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య రంగంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా 900కు పైగా సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

 *పెట్టుబడుల వరద… ‘బ్రాండ్ ఆంధ్ర’ దిశగా* 

చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి గ్లోబల్ అవుట్‌రీచ్ వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పల్లా అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కేవలం 20 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చరిత్రాత్మకమన్నారు.

 *వ్యవసాయం, నీటిపారుదలలో ప్రగతి* 

సాగునీటి ప్రాజెక్టులకు రూ.23,793 కోట్లు ఖర్చు చేసి, పోలవరం వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు మార్కెట్ సపోర్ట్, నీటి వనరుల పెంపు ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

కేవలం 22 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలలో 95% అమలు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకత్వం చంద్రబాబు గారిదేనని పల్లా స్పష్టం చేశారు. లోకేష్ గారి కృషితో యువతకు ఉపాధి, రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రజలకు సంక్షేమం ఈ మూడు రంగాల్లో కూటమి ప్రభుత్వం అపూర్వ విజయాలు సాధించిందన్నారు.


ఇకనుంచి కూడా ఇదే వేగంతో సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రతి కుటుంబానికి మేలు చేసేలా కృషి చేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే పాలన కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...