Skip to main content

విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం... ...నెరవేరిన విశాఖ ప్రజల కల.. ...ప్రధాని మోదీకి,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు పివియన్ మాధవ్ కృతజ్ఞతలు

విశాఖపట్నం న్యూస్:విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 1 నాటికి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించడంతో, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 ఫిబ్రవరి 17న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అదే నెల 28న కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపీఆర్ )కు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.

జోన్‌కు శాశ్వత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి 2025 జనవరి 8న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముడసర్లోవలో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సుమారు రూ.183 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని ముడసర్లోవలో 52.2 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ సముద్ర తీరానికి ప్రతీకగా క్రూయిజ్ ఆకారంలో ఆధునిక సదుపాయాలతో కూడిన  12 అంతస్తుల ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణం రూ.107 కోట్ల తో కొనసాగుతోందని తెలిపారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విఎంఆర్ డి ఏ ఐకానిక్ “ది డెక్” భవనం నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుమాధవ్  తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రం లో  దక్షిణ మధ్యరైల్వే జోన్ గా ఉన్న  రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్ (పాత వాల్తేర్ డివిజన్ నుంచి విడదీసినది), విజయవాడ, గుంటూరు, గుంటకల్ డివిజన్లు ఉండనున్నాయని, ఈ జోన్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కొన్ని ప్రాంతాలను కూడా కలుపుకుంటుందని తెలిపారు.

భూసేకరణ వంటి కారణాలతో ఆలస్యం అయిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగవంతంగా అమలులోకి వచ్చిందని, జనరల్ మేనేజర్ నియామకం పూర్తయ్యి నిర్మాణ పనులు పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు.

విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ద్వారా రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు, కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్ ఫారమ్ విస్తరణతో పాటు ,15 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు మరియు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...