కొమరగిరిపట్నంలో తాగునిటి సరఫరాకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.... జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి....
డా. బియర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావిరాల మహేష్ కుమార్ కు సోమవారం కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. కొమరగిరిపట్నం గ్రామపంచాయితీ పరిదిలో పి డబ్ల్యూ ఎస్ మంచినీటి చెరువు అభివృద్ధి పనుల దృష్ట్యా గత సంవత్సరం చెరువు నీటిని ఆరగట్టి కాంట్రాక్టరకు అప్పగించటం జరిగిందని, అప్పటి నుండి పంట కాలువ ద్వారా మంచినీటిని ఫిల్టరింగ్ చేసి మంచినీటిని గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకు నుండి మంచినీటి కుళాయి చెరువునకు వెళ్ళే 3 ఫేస్ కేబుల్ మోంథా తుఫాన్ దృష్ట్యా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు ఎక్కడికక్కడ కట్ చేయటం వలన మంచినీటి కుళాయి చెరువు దగ్గర 10 హెచ్ పి మోటార్లు పని చేయుటకు వీలు పడటం లేదని, ఈ సమస్యపై ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులకు తెలియపరచియున్నప్పటికీ స్పందించడంలేదని అన్నారు. ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకు నుండి మంచినీటి కుళాయి చెరువునకు వెళ్ళే 3 ఫేస్ కేబుల్ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సర్పంచ్ విజయలక్ష్మి కోరారు.

Comments
Post a Comment