కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ తరహాలో రాష్ట్ర స్థాయిలో మైగ్రేషన్ పోర్టల్ ఏర్పాటు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ కు సీఎం చంద్రబాబు అభినందనలు..
అమలాపురం..విశాఖ సందేసం అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి సచివాలయంలో నిర్వహిస్తున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం తొలి రోజు కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. సమావేశంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు,దాని అమలుకు రూపొందించిన పది సూత్రాలు,స్వచ్ఛాంధ్ర కార్యక్రమం,రాష్ట్ర జీఎస్డీపీ లక్ష్యాలు,జిల్లాల్లో అమలవుతున్న పథకాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అలాగే పీపీపీ ప్రాజెక్టులు,ఆర్టీజీఎస్ సేవలు, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం,పెట్టుబడులు, వైద్యా అరోగ్య రంగం,సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో
విడత అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇంద్రధనస్సు పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కుసుమ్ పథకం కింద 3 లక్షల పంప్ సెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో “ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్” ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని,డేటా డ్రివెన్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టాలని సూచించారు.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని,స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బంది సేవలను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎం ఈలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.రైతులకు సహాయం కోసం “రైత న్నా మీకోసం” కార్యక్రమాన్ని ఈ నెల 16–18 మరియు 23–25 తేదీల్లో నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డా.ఆర్ . మహేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. 2024 ఆగస్టు నుంచి మిడి ల్ ఈస్ట్ దేశాలకు వెళ్లిన కోనసీమ వాసుల సమస్యలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయం సహకారంతో సేకరించిన డేటా ప్రకారం 2017–2024 మధ్య ప్రతి సంవత్సరం సుమారు 3,000–4,000 మంది కోనసీమ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వలస వెళ్తుండగా, 2023–24లో ఈ సంఖ్య సుమారు 14,000కి పెరిగింది. వీరిలో ఎక్కువ మంది హౌస్‌కీపింగ్,కుక్,సెక్యూ రిటీ గార్డ్,డ్రైవర్,కార్పెంటర్,లేబర్ వంటి పనులు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు 2025 మార్చిలో కలెక్టరేట్‌లో “కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్” ఏర్పాటు చేసి ఐదుగురు సభ్యుల తో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఇప్పటివరకు 265 కేసులు నమోద య్యాయి.హెల్ప్‌లైన్ 1800-425- 0488 ద్వారా ప్రతిరోజూ ఫిర్యాదులు అందుతున్నాయి.ఇప్పటివరకు 87 మందిని విదేశాల నుంచి భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. ఉద్యోగ మోసాలపై 41 విచారణలు కూడా నిర్వహించారు.ఈ చర్యలను అభినందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమలో ప్రారంభించిన ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచిస్తూ రాష్ట్ర స్థాయిలో మైగ్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.




Comments
Post a Comment