జర్నలిస్టుల హక్కుల పోరాటం:* *విశాఖ నుంచి విజయవాడకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాత్రికేయ బృందం*
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) పిలుపు మేరకు రేపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న 'చలో విజయవాడ' కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి పాత్రికేయులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ మహాసభలో పాల్గొనేందుకు, విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి పాత్రికేయ సోదరులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు
వృత్తిపరమైన భద్రత, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం మరియు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను వినిపించేందుకు విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు ఐక్యతతో కదిలి విజయవాడకు వెళ్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా జరగనున్న ఈ పోరాట సభను విజయవంతం చేయాలని వారు ఆకాంక్షించారు

Comments
Post a Comment