Skip to main content

జర్నలిస్టు సంక్షేమానికి అండగా… సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా గంట్ల శ్రీనుబాబు పేరు ప్రతిష్ఠలు ఆశించకుండా నిశ్శబ్దంగా సేవలు… జర్నలిస్టులు, పేదలు, విద్యార్థులకు అండగా నిలుస్తున్న సేవాభావి గంట్ల

విశాఖపట్నం:సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడం చాలా మందికి మాటల్లో మాత్రమే పరిమితం అవుతుంటుంది. అయితే ఆ మాటలను కార్యరూపంలో చూపిస్తూ, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమాజ సేవలోనూ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తిగా గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, అనేక సేవా సంస్థలకు గౌరవ అధ్యక్షుడిగా, పలు ఆలయాలకు గౌరవాధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుండే ఆయన, అవసరమైన సందర్భాల్లో వ్యక్తిగత నిధులతో సహాయం అందిస్తూ ఎంతో మందికి భరోసాగా నిలుస్తున్నారు.

జర్నలిస్టుల కుటుంబాలకు, ముఖ్యంగా వారి పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం చేయడం, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాత్రికేయులకు చేయూతనందించడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ధైర్యం నింపుతున్నారు. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ నిజమైన మిత్రుడిగా నిలుస్తున్నారు.

అంతేకాకుండా ఎక్కడ అన్నదానం జరిగినా తన వంతు సహాయం అందించడం, ముస్లిం సోదరులకు “తోఫా” కార్యక్రమాల ద్వారా చేయూత ఇవ్వడం, పేద విద్యార్థులకు చదువుల కోసం వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు.

 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి, ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దినకార్యాల వరకు కుటుంబ సభ్యుడిలా నిలబడటం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. సొంత బంధువులే పట్టించుకోని పరిస్థితులు కనిపించే ఈ రోజుల్లో, వ్యక్తిగత నిధులతో అనేక మందిని ఆదుకుంటూ నిజమైన మానవత్వాన్ని చాటుతున్నారు.

పేరు, ప్రఖ్యాతి కోసం కాకుండా సేవే ధ్యేయంగా నిశ్శబ్దంగా తన పనిని కొనసాగిస్తున్న గంట్ల శ్రీనుబాబు, వేలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలోనూ తన వంతు బాధ్యతగా ముందుండే ఆయన వంటి వ్యక్తి జర్నలిస్టు సమాజానికి ఉండటం గొప్ప విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించే శక్తి భగవంతుడు ప్రసాదించాలని పాత్రికేయ మిత్రులతో పాటు అనేక మంది ఆకాంక్షిస్తున్నారు.


 హ్యాట్సాఫ్ టు గంట్ల 🌹

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...