స్థానిక యం.వి.పి. కాలనీలో గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీమరియు పి.జి కళాశాల (అటానమస్) సమావేశమందిరంలో శ్రీ పరాభవ నామసంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగశ్రవణం కార్యక్రమం నిర్వహింపబడినది. ఇది మానవీయ మరియు ఆధ్యాత్మిక విలువల అధ్యయన కేంద్రం మరియు భారతీయ విజ్ఞాన వ్యవస్థసంయుక్తంగా నిర్వహించింది. ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, అధ్యాత్మిక సేవాపీఠ వ్యవస్థాపకులయిన శ్రీ కాండూరి లక్ష్మణ స్వామి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ'పరాభవ నామ సంవత్సరంలో వివిధరాశుల వారికి ఆదాయవ్యయములు, శుభాశుభ సమాచారము, భారత దేశపరిస్థితి ప్రపంచ శాంతిభద్రతల గురించి విపులంగా విశ్లేషించి వివరించారు. యాజమాన్యం నుండి ఆచార్య పి. సోమ రాజు గారు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాయత్రి విద్యా పరిషత్, ఆచార్య పి.వి.శర్మ గారు వ్యవస్థాపక సభ్యులు, ఆచార్య ప్రగడ రాజ గణపతిగారు, ఆచార్య వి. యస్. ఆర్. కృష్ణ ప్రసాద్ గారు తదితర యాజమాన్య సభ్యులు విచ్చేసి ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రకటించారు. ఆచార్య కె.యస్.బోస్, కళాశాల ప్రిన్సిపాల్
ఆచార్య పి.వి.మోహిని, స్టూడెంట్ అఫైర్స్ డీన్, శ్రీయుతులు డి.గిరిధర్ డైరక్టరు, యు.జి కోర్సులు, డాక్టర్ కె.సాయిరూప్, డాక్టర్ కె.వి.వి మురళీ సోమేశ్వరరావు, , డాక్టర్ యం. యస్. ఆర్ శేషిగిరి ఇత్యాదులు కార్యక్రమానికి హాజరయి రాబోయే సంవత్సరంలో కలిగేవిశేషాలను ఆశక్తిగా ఆలకించారు. తరువాత గాయత్రీ యాజమాన్యం. ప్రిన్సిపాల్, డీన్స్ విభాగాధిపతులు, అధ్యాపక బృందం ముఖ్యఅతిధిని ఫలములు, జ్ఞాపిక దుశ్శాలువ దుశాలువ తో సత్కరించారు. ఈ సంవత్సరం అధిపతిగా దేవగురవయిన బృహస్పతి, మంత్రిగా కుజుడు ఉండడం వలన పరిపాలన, మంత్రాంగము చక్కగా నిర్వహింపబడుతుంది. ద్వేషం, హింస, అసత్యం, స్వార్థం వదిలి అందరినీ ఆదరిస్తే శుభపరంపరలు కలుగుతాయని 'పరాభవ" నామ సంవత్సరం తెలియ చేస్తున్నది.శ్రీమతి శేషపద్మ పత్రికాప్రజాసంబంధాల అధికారి , విభాగాధ్యక్షులు, అధ్యాపక బృందం కార్యక్రమంలో పాల్గోన్నారు.

Comments
Post a Comment