అల్లవరం, విశాఖ సందేసం...మండలంలోని బెండముర్లంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ ఇల్లా శేషగిరిరావు, వైస్ ఎంపీపీ ముత్యాల రామకృష్ణ, కొమరిగిరిపట్నం సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి, బెండమూర్లంక సర్పంచ్ బర్రె సీతారత్నం గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. సూర్య నాగేష్ 14 సంవత్సరాల బాలికలు మరియు వారి తల్లిదండ్రులకు సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వైద్య సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎన్.ఎల్.వి. రంగనాధ్, స్టాఫ్ నర్స్ ప్రసన్న కుమారి, ఫార్మసిస్ట్ పుష్ప సత్య , ల్యాబ్ టెక్నీషియన్ స్వామి , హెల్త్ అసిస్టెంట్లు వినయ్, ప్రసాద్, ఎంఎల్హెచ్‌పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment