విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఎపిబిజెఎ) సంయుక్త ఆధ్వర్యాన ‘జర్నలిస్టుల చలో విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా విజయవాడలోని రాఘవయ్య పార్కు నుండి ర్యాలీ ప్రారంభమై బందరులాకులు,
పాతబస్టాండ్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని, ఆరోగ్య బీమా పథకానికి తోడుగా ప్రతి ఆరు నెలల కొకసారి జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలపై అధ్యయనానికి మీడియా కమిషన్, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలపై అధ్యయనానికి మీడియా కమిషన్, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు హైపవర్ కమిటీలను, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కార్మిక బీమా సదుపాయం వర్తింపజేయాలని, రైల్వే ప్రయాణంలో రాయితీని కొనసాగించాలని కోరారు. ర్యాలీ అనంతరం కళాక్షేత్రంలో సభ నిర్వహించారు. 
ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సభలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొనున్నారు



Comments
Post a Comment