Skip to main content

ఉత్తరాంధ్ర రూపురేఖలనే మార్చనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభి.

విశాఖ పట్నం, మార్చి 22.అనకాపల్లిలో 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పనున్న స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలే మారి పోతుందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన విశాఖ తూర్పు నియోజక వర్గం లోని 18వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నా రన్నారు. నారా లోకేష్ చొరవ వల్లే అనకాపల్లిలో 2200 ఎకరాల విస్తీర్ణంలో ఒక లక్షా 35వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాబోతుం దన్నారు. దీని స్థాపన వల్ల 55వేల మందికి ప్రత్యక్షంగానూ, మరి కొన్ని వేల మందికి పరోక్షంగానూ ఉపాధి దొరుకుతుందన్నారు. దీన్ని 2029వ సంవత్సరం కల్లా పూర్తి చేసి వినియోగంలోకి తెస్తారన్నారు. ఇది కాకుండా 1234 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎర్త్ మూవర్స్ సంస్థ, 784 కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఉత్తరాంధ్రలో నెలకొల్పుతుం దన్నారు. గ్రీన్ హైడ్రోజెన్ సిటీ ప్రాజెక్ట్, క్లీన్ టెక్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, మెడ్ టెక్ జోన్, బిక్యూ టెక్స్టైల్స్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో ఉత్తరాంధ్ర అన్నింటా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో విశాఖ పట్నం టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ బైరెడ్డి పోతనరెడ్డి, 18వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు గొలగాని పోలారావు, కళావతి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...