Skip to main content

జాతీయ ఉపాధి హామీ పధకం నిర్వీర్యంపై కాంగ్రెస్ పోరాటం ఆగదు : రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన షర్మిల రెడ్డి

 అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వై జంక్షన్ వద్ద  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  కొత్తూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల రెడ్డి  పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు,కొత్తూరి శ్రీనివాసరావులు  వై.యస్ షర్మిల రెడ్డి ఘనంగా  ఆహ్వానం పలికారు.

షర్మిల రెడ్డి  మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావడం ఖాయమని, దేశంలోనూ రాష్ట్రంలోనూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారి యొక్క ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ ప్రజల  సమస్యలను అమలాపురం కమిషనర్, జిల్లా  కలెక్టర్ దృష్టికి ఫోన్లో మాట్లాడి  సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజలకు అవసరమయ్యే పనులను సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు మాట్లాడుతూ పెన్షన్ లేవని, తాగు నీరు  సరిగా అందడం లేదని వృద్ధులైన మమ్మల్ని పట్టించుకోవడంలేదని అనేక సమస్యలు షర్మిల దృష్టికి తీసుకురాగా వైయస్ షర్మిల రెడ్డి  విధంగా కలెక్టర్ తో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోఆర్డినేటర్లు ఇన్చార్జిలు కార్యకర్తలు నాయకులు ఏ.ఐ.సి.సి మెంబర్ బి ఆర్ కే నాయుడు,జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్ అయితాబత్తుల సుభాషిని,అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి,మండల అధ్యక్షులు పోలిశెట్టి హరిబాబు,అప్పన రామ కృష్ణ, ఏలేశ్వరం రాధాకృష్ణ, బీ.సీ నాయకులు కుడుపూడి శ్రీనివాస్, ముషిణి రామకృష్ణారావు,ధోనిపాటి విజయలక్ష్మి,మహబూబ్ షకిలా, మాచవరపు శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...