Dr. నండూరి రామకృష్ణ 25.03.2026
ఏమిటీ నేటి
సినీ పాటల
సాహిత్యం,
వేదికల మీద
కేకలు, అరుపులు,
గంతులు,
వేదికల ముందు
కేకలు,
కేరింతలు,
అరుపులు,
ఈలలు,
యువతను
పెడదారి
పట్టించడమే!
సందేశం
కానరాదు,
Fast Food
లాంటిది,
క్షనికానందం,
డబ్బు కోసం
జబ్బుతో
చేస్తున్న
వికారాల
విందులు
అనవచ్చా!
నిందలు
ఆపాదించు
కోవడం కోసమా!
లేక TV ఛానల్స్
పైత్యం
అనుకోవాలా!
సంగీత స్వరాలతో
కూడిన మాధుర్యం,
గతి తప్పిన
స్వరాలు,
భావాల
గెOతులు,
తనను తాను
మరచి
'తమన్'
అందించే
స్వరాలు
అనుకోవాలా!
వద్దు, వద్దు
చానెల్స్ రేటింగ్
కోసమా!
సంప్రదాయంలకు
పెద్ద పీట వేసే
ఒక్క పాట
కానరాదు.
గాయనీ
గాయకులు
ఆలపిస్తున్న
తరుణం లో
వారి తీరు
తెన్నులు,
గంతులు,
వెకిలి చేష్టలు
దేనికి
సంకేతం?
యువత కు,
రాబోయే
తరాలకు
మీరిచ్చే
సందేశం
ఇదేనా!
సమాజం
సిగ్గుతో
నివ్వేర
పోతోంది.
ఇలాంటి
ప్రదర్శన లను
ప్రోత్సహించొద్దు,
నేటి మన
తరాన్ని
తల వంపులకు
గురి చెయ్యొద్దు.
నేటి తరం
భవిష్యత్తును
అగమ్య గోచరం
చెయ్యొద్దు,
చరిత్ర హీనులుగా
మిగలొద్దు.
మన ప్రాచీన
సంస్కృతీ
సంప్రదాయ
కళలను
మరవొద్దు.
వేదిక మీద
పాడేవారి
గంతులు,
పిలుపులు,
పలకరింపుల
శ్రోతల అరుపులు
తోడై, ముందు
వరసలో
ఆశీనులైన
ఆహ్వానితులు
నిషెచేస్తులై
ఇదేమి విడ్డురమ్
అపచారం
అనుకుంటూ,
ఏ కార్యక్రమం ఐనా
సందేశాత్మకంగా
ఉండాలి,
ఈ బరి తెగింపు
లీలలు, వెకిలి
చేష్టలకు
వేదికలు కావద్దు.
వసంతాల
వేడుకలు
గతి తప్ప
కూడదు
అన్నది
అందరి
అభిప్రాయం.

Comments
Post a Comment