Skip to main content

శతాధిక గ్రంథ రచనలు* *సిమ్మన్న సొంతం* *లోక్ నాయక్ పురస్కార గ్రహీత "ఆచార్య వెలమల సిమ్మన్నకు ఘన సన్మానం* *నడిచే గ్రంధాలయం సిమ్మన్న* తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా

 

ఆంధ్ర విశ్వవిద్యాలయం మార్చి 2 బహుభాషా కోవిదులు.. శతాధిక గ్రంధ రచయిత.. సిమ్మన్న అనితర 

 అసాధారణ ప్రతిభావంతులనీ పలువురు వక్తలు కొనియాడారు..సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జెర్ర అప్పారావు అధ్యక్షతన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత 

ప్రముఖ గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న సన్మాన సభ ఘనంగా నిర్వహించారు... ముఖ్యఅతిథిగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కలశాల ఆచార్యులు జాలాది రవి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి పి. ప్రేమానందం, ఆంగ్ల విభాగాధిపతి సాల్మన్ బెన్నీ, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి ధనరాజ్, హిందీ విభాగాధిపతి ఆచార్య నల్లా సత్యన్నారయణ, మానవ వనరుల నిర్వహణ శాఖాధిపతి ఆచార్య అరుణ్ కుమార్  పాల్గొన్నారు. ముందుగా సభాధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ సిమ్మన్న గురువువంటి గొప్ప వ్యక్తి మరొకరు లేరని వారిలో సిమ్మన్న  ఒకరు అని ఆచార్యులు గా పనిచేస్తూ శతాధిక గ్రంథ రచన చేయడం అసామాన్య విషయం అని అతని ప్రజ్ఞ పాటవాలను తెలిపారు. ఆచార్య గజ్జా యోహాను బాబు మాట్లాడుతూ పరిశోధన స్థాయి నుండే సిమ్మన్న అందరితో సోదర భావం కలిగి ఉండేవారని నిరంతరం సాహిత్యం చదువుతూ ఎన్నో పుస్తకాలు రాసి తెలుగు సాహిత్యాన్నీ సుసంపన్నం చేశారు అని పేర్కొన్నారు. ఆచార్య ప్రేమానందం మాట్లాడుతూ సిమ్మన్న గారు మాకు మార్గదర్శకులని అని అన్నారు. ఆచార్య బెన్నీ మాట్లాడుతూ సిమ్మన్న గారూ పురస్కారానికి అర్హులేనని ఎంతో కఠోర సాధన,

 త్యాగం లేనిదే ఇన్ని పుస్తకాలు రాయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.ఆర్ట్స్ అండ్ కామర్స్ కలశాల ప్రాచార్యులు జాలాది రవి గారు మాట్లాడుతూ సిమ్మన్న గారి సాహిత్య సేవ అనిర్వచనీయమైనది అని తెలుగు శాఖలో ఎక్కువ ఫెలోషిప్ లో పొందడానికి సిమ్మన్న గారి పుస్తకాలు విద్యార్థులుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.  ఆచార్య ధనరాజ్ మాట్లాడుతూ సిమ్మన్న గారు నడిచే గ్రంథాలయమని తమకి ఆదర్శమని అన్నారు. ఆచార్య నల్లా సత్యన్నారాయణ మాట్లాడుతూ సిమ్మన్న గారి శ్రమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఎందరికో ఉద్యోగాలు రావడం లో ఆయన పుస్తకాలు కీలకమని కొనియాడారు. ఆచార్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ పుస్తకాలు రాయాలంటే ఓపిక సహనం పట్టుదల కృషి ఉండాలని అవన్నీ కూడా మెండుగా గా ఉన్నాయని అన్నారు. సన్మాన కర్త స్పందనగా ఆచార్య సిమ్మన్న మాట్లాడుతూ తన జీవితం సాహిత్యమయం అని తన గురువుల యొక్క సూచనలు తనని ప్రభావితం చేశాయి అని, తన క్రమశిక్షణే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది అని తన పుస్తక రచనలో తన సహధర్మచారిని కృషి వలనే ఇదంతా సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  తెలుగు దండు అధ్యక్షులుపరవస్తు ఫణిశయన సూరి, జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి.. పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు..డాక్టర్ గిరీష్ కుమార్ , డాక్టర్ ఎం. దాసు, డాక్టర్ ఎం ప్రతాప్, డాక్టర్ పి.శ్రీనివాసరావు,డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ ఎమ్ .కృష్ణవేణి, మరియు పరిశోధకులు స్నాతకోత్తర  విద్యార్థులు తదితరులు ఘనంగా సత్కరించారు.. పెద్ద ఎత్తున సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...