ఐ.ఎస్.ఓ గుర్తింపు సాధించిన కొమరగిరిపట్నం పంచాయతీకి అభినందనలు: మాజీ ఎంపీ చింతా అనురాధ... సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి సత్కరించిన మాజీ ఎంపీ
అల్లవరం, విశాఖ సందేసం....ఐ.ఎస్.ఓ గుర్తింపు సాధించిన కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి ను అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ సోమవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మికి పూలదండలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల(ఐఎస్ఓ) ధ్రువీకరణ పత్రం కోసం ఎంపిక చేయగా,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఈ ప్రతిష్టాత్మక ఐ ఎస్ ఓ ధ్రువీకరణ పత్రం లభించడం చాలా గర్వకారణమని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి, పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్లే ఐ.ఎస్.ఓ గుర్తింపు సాధ్యమైందని ఎంపీ పేర్కొన్నారు.ఇలాంటి విజయాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బందిని మాజీ ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, బెండమూర్లంక సర్పంచ్ బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment