విశాఖపట్నం, మార్చి 22:ఉత్తర నియోజకవర్గంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యయ మహా ప్రశిక్షణ కార్యక్రమం ఆదివారం ద్వారకానగర్‌లోని బివికె కాలేజీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన తో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు శిక్షణలో చెప్పే అంశాలను శ్రద్ధగా అవగాహనా చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీలోని నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలతో సత్సంబంధాలు మెరుగు పరచు కోవాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే గారు కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిత్రపటాల ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. పార్టీ గొప్పతనాన్ని ప్రతిబింబించే ఫోటోలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కార్యకర్తలను విశేషం గా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు, బుద్ధ లక్ష్మీనారాయణ, సుహాసిని ఆనంద్, విజయనంద్ రెడ్డి, కేశవ కాంత్, సురేష్ బాబు, పుట్ట గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
D.S.Varma Sr Sub EDITOR

Comments
Post a Comment