ఈరోజు 19-03-2026 గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు అధ్యక్షతన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ఉగాది యొక్క విశిష్టతను వివరిస్తూ మాట్లాడుతూ ప్రజలందరికి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపుతూ ఉగాది మన తెలుగువారందరికీ తొలి పండుగ అని అన్నారు. ఈ రోజున ఏదైనా ఒకమంచి పనిని మొదలుపెడితే సంవత్సరమంతా ప్రతి పని దిగ్విజయంగా నెరవేరుతాయని ప్రజలందరికి నమ్మకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, BJP రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ A కేశవకాంత్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జ్ బోండాడ నరేంద్ర ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా కొమరగిరి సుహాసిని ఆనంద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్ మరియు జిల్లా పదాధికారులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అదేవిధంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు పంచాంగ పఠనం చేయగా పార్టీ నాయకులూ కార్యకర్తలందరు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
అనంతరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద వాల్తేరు లో ఉన్న పోలమాంబ అమ్మవారికి బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఊరేగింపుగా మేళతాళాలతో వెళ్లి చీర సారె ను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, BJP రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ A కేశవకాంత్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జ్ బోండాడ నరేంద్ర ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా కొమరగిరి సుహాసిని ఆనంద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్ మరియు జిల్లా పదాధికారులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment