పెందుర్తి నియోజకవర్గం రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం* *ఇటీవల ఎం.పీ సి.ఎం రమేష్ గారు ప్రస్తావించిన పనులకు నేడు రైల్వే శాఖ టెండర్ ప్రకటన*
స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ గారు ఇటీవల జరిగిన రైల్వే సమీక్ష సమావేశంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రత్యేకంగా ప్రస్తావించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించిన నేపథ్యంలో రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది.ఆ మేరకు సంబంధిత పనుల కోసం నేడు టెండర్లను ఆహ్వానించింది.పెందుర్తి - సింహాచలం నార్త్ రైల్వే మార్గం వద్ద శర్మ శక్తి నగర్ ప్రజలు స్మశాన వాటికకు సులభంగా చేరుకునేలా రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి డాక్టర్ సి.ఎం రమేష్ గారు డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు జనరల్ మేనేజర్ దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించి రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ద్వారా టెండర్ ప్రకటన విడుదల చేశారు.
ఈ పనికి సుమారు రూ.1.72 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి సుమారు 12 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.ఈ నిర్మాణం పూర్తయిన అనంతరం శ్రమ శక్తి నగర్ ప్రాంత ప్రజలకు స్మశాన వాటికకు వెళ్లేందుకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన మార్గం అందుబాటులోకి రానుంది.ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ గారి చొరవతో ఈ పనికి శ్రీకారం చుట్టబడిందని కూటమి నాయకులు పేర్కొన్నారు.

Comments
Post a Comment