Skip to main content

వైభవంగా అప్పన్న పెళ్లి చూపులు ముహూర్తం కుదిరింది.. ఉగాది నాడు పెళ్లిరాట పెళ్లి కుమారుడు అలంకరణ

 
మార్చ్ 3 ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం..(పెళ్లిచూపులు) మంగళవారం అంగరంగ.. వైభవంగా జరిగింది.. తెల్లవారుజామున ఒంటిగంటకు స్వామిని సుప్రభాత  సేవతో మేలుకొలిపిఆరాధన గావించారు.. నాలుగు గంటలకు మెట్లు మార్గం ద్వారా బోయిలు కొండ దిగువకు  తీసుకువచ్చారు.. అక్కడ నుంచి స్వామి నేరుగా తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయం కు చేరుకున్నారు.. అమ్మవారి దర్శనం అనంతరం తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అమ్మవారు ప్రార్థిస్తారు.. ఆలోచించుకొని చెబుతానని గ్రామ మధ్యకు చేరుకున్న స్వామి పుష్కరనీ సత్రంలో ఉయ్యాలలో ఆసీనులు అవుతారు.. అక్కడ డోలీలో విశేష పూజలు జరిపించుకొని వసంతోత్సవం చూర్ణోత్సవం అనంతరం గ్రామ తిరు వీధికి బయలుదేరారు.. గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వామి వారిని స్వాగతించారు.. ఆ తర్వాత మరోసారి పైడితల్లి అమ్మవారు  ఆలయానికి చేరుకొని అమ్మ వారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి  అంగీకరిస్తారు.. దీంతో స్వామి వివాహం ఖరారు 

కావడంతో  అర్చక వర్గాలు.. అధికారులు.. ఉద్యోగులు.. భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలు కొట్టారు. ఈవో వెంకటరావు దంపతులు . ఈ పూజల్లో పాల్గొనగా  ఏఈవోలు.. ఉన్నతాధికారులు అంతా పాల్గొన్నారు.. అర్చక స్వాములు. అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు... సింహాచలం దేవస్థానం ఈ ఓ జె.వెంకటరావు ఆధ్వర్యంలో 

ఉత్సవానికి  విశేషాలు ఏర్పాటు చేశారు.. ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. డోలిలో కొలువున్న స్వామి వారి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని ఆలయ స్థానాచార్యులు  టీపీ రాజగోపాల్ తెలియజేశారు.. .. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ..ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి 

గంట్ల శ్రీనుబాబు సింహాద్రి నాథుడు ను..దర్శించుకున్నారు.. అనంతరం గ్రామ తిరువీధిలో పాల్గొన్నారు.. సింహాద్రి నాథుడు పెళ్లిరాట ఉగాది పర్వదినం రోజు వేయనుండగా.. అదే రోజు పెళ్ళికొడుకు అలంకరణ గావిస్తారు.. చంద్రగ్రహణం సందర్భంగా తెల్లవారుజామున ఎనిమిది గంటల లోపు గా అన్ని ఉత్సవాలు పూర్తి చేశారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...