Skip to main content

గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి వాసంశెట్టి సుభాష్.... ఏపీ ఎన్ ఆర్ టి సి హెల్ప్‌లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని భరోసా...

రామచంద్రపురం, విశాఖ సందేసం..గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి పరిస్థితులను అడిగి  తెలుసుకుని ధైర్యాన్ని నింపారు.

ఇజ్రాయిల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు,ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని  చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారికి భరోసా కల్పించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్.ఆర్.ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు Andhra Pradesh Non-Resident Telugu Society (APNRTS)ఈమెయిల్: helpline@apnrts.com లకు, 24/7 హెల్ప్ లైన్, +918500027678 వాట్సాప్ ద్వారా సమాచారం అందించ వచ్చునన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులందరూ ఆందోళన చెందకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రతినిధి బొంతు నాగరాజు సంక్షోభ సమయంలో తమతో ప్రత్యక్షంగా మాట్లాడి ధైర్యం చెప్పినందుకు ప్రత్యేకంగా అభినందించారు. కార్మికుల పట్ల మంత్రి సుభాష్ కున్న చిత్తశుద్ధిని ప్రస్తుతించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...