Skip to main content

అరుదైన వ్యాధి భారినపడి అనుక్షణం నరకం అనుభవిస్తున్న బాలిక, తన బిడ్డకు ప్రాణ బిక్ష పెట్టమంటూ రోదిస్తున్న అ తల్లి.... దాతల సహాయం కోసం అ కుటుంబం ఎదురుచూపు....

 

అయినవిల్లి, విశాఖ సందేసం....అరుదైన వ్యాధి భారిన పడి అను క్షణం నరకం అనుభవిస్తున్న బాలిక, తన బిడ్డకు ప్రాణ బిక్ష పెట్టమంటూ ఓ తల్లి రోదిస్తున్న తీరు

చూపరులను కంటతడి పెట్టిస్తోంది... అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంకు చెందిన 

ఉండ్రాజవరపు దావీదు రాజు, మేరీ బేబీ 

ల 11 సంవత్సరాల కుమార్తె మాధురి పుట్టిన 4 వ సంవత్సరంలో విపరీతమైన అనారోగ్యానికి గురికావడంతో అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు.అక్కడి ట్రీట్మెంట్ తో కొంతకాలం స్థిమిత పడిన మాధురి తరువాత తరచూ అనారోగ్యానికి గురౌతుండటంతో క్యాన్సర్ గా అనుమానించి విశాఖపట్నంలో బోన్ మ్యారో పరీక్ష చేయించడంతో క్యాన్సర్ కంటే భయంకరమైన అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి సోకిందని వైద్యులతెలిపారు.ఈ వ్యాధి వలన ఎముక మజ్జ కొత్త రక్త కణాలను తయారుచేయడం ఆపేస్తుందని దీనివలన శరీరంలోని రక్తం తరిగిపోయి ఇన్ఫెక్షన్ లకు రక్తస్రావానికి గురవుతూ ప్లేట్ లెట్స్ తగ్గిపోతూ ఉంటాయని తద్వారా రోగి మరణిస్తుందని వారు పేర్కొన్నారు. తరచూ రక్త మార్పిడీ అలాగే స్టెమ్ సెల్స్ మార్పిడి చేస్తూ ఉండాలని లేదంటే దెబ్బతిన్న ఎముక మజ్జను కొత్తదానితో మార్చడం అనగా 

స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని 

వైద్యులు తెలిపారని మాధురి తల్లితండ్రులు చెప్పారు.. ఇప్పటికే 

రక్తం, ప్లేట్ లెట్స్ మార్పిడికొరకు తమ తాహతుకు మించి లక్షలాది రూపాయలు అప్పుచేసి ఖర్చు చేసామని మాధురి తల్లితండ్రులు అన్నారు. సుమారు 30 లక్షల రూపాయల వరకూ ఈ చికిత్సకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని కడు బీదరికంలో ఉన్న తమకు అంత స్తోమత లేదని తమ చిన్నారి వైద్యానికి ప్రజలే ఆర్ధిక సహకారం అందించి ప్రాణ భిక్ష పెట్టాలని వారు మీడియా ముందు కన్నీటి  పర్యవంతమయ్యారు . తమకు సహాయం చేయాలనుకునే దాతలు తన ఫోన్ నంబర్ 630 152 1732 కు ఫోన్ పే చేయాలని దావీదు రాజు, మేరీ బేబీలు అభ్యర్దించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...