Skip to main content

గ్రామ ప్రజలకు వైద్యం అందించిన రోహిణి తల్లి పిల్ల ఆసుపత్రి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి..... రోహిణి తల్లి పిల్ల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్.....

అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్  రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమలాపురం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వి ఎస్ ఎస్ మూర్తి, ప్రముఖ గర్భిణీ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ వి శారద, బోడసకుర్రు గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ మా గ్రామంలో కార్పొరేట్ హాస్పిటల్ రోహిణి డాక్టర్స్ ఇద్దరూ వచ్చి 150 మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాక చిన్నపిల్లలకు అవసరమైన టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేసినందుకు రోహిణి హాస్పటల్ మరింత అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో పల్లెటూరులో మరిన్ని క్యాంపులు నిర్వహించాలని కోరుకుంటూ బోడసకుర్రు క్రాంపు నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు చింతం శ్రీను, పంచాయతీ కార్యదర్శి చిట్టిబాబు, బిల్  కలెక్టర్ ఇళ్ల వినాయకరావు, రొక్కాల నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ మొయిల గణపతి, దొమ్మేటి రాధాకృష్ణ, ముత్యాల బాబి, పంచాయతీ స్టాపు, హెల్త్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...