అల్లవరం, విశాఖ సందేసం.... అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయితీ పరిధిలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు అధ్యక్షతన స్వచ్చరధం వాహన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలను సంపదగా మార్చే ఉద్దేశంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన చెత్తకు బదులుగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయుట ఈ వాహనం యొక్క ఉద్దేశం అని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు చింతం శ్రీను, పంచాయితీ జూనియర్ అసిస్టెంట్ చిట్టిబాబు, బిల్ కలెక్టర్ వినాయకరావు, గ్రామ సచివాలయం స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment