స్నేహ సంధ్యా సభ్యులు ఆదిభట్ల. రామకృష్ణ గారి దంపతులు,N. కృష్ణమూర్తి గారు, P. సత్యవంత రావు వన్ టౌన్ నందు ఉన్న వివేకానంద అనాధ ఆశ్రమానికి బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇడ్లీ నూక, పంచదార, ఆయిల్ 6000 /-రూపాయలు విలువ గల నిత్యవసర వస్తువులను అనాధాశ్రమానికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్యాస్ కొరత వల్ల కొన్ని హోటల్లు మూసివేసిన తరుణంలో కూడా, వివేకానంద సంస్థ వారు మధ్యాహ్నం ,రాత్రి వేళ ప్రతిరోజు 100 మందికి నిత్య అన్నదానాలు చేయడం చాలా గొప్ప విషయమని, మేము కూడా వారి సేవలో భాగం పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. సత్యవంతరావ్ గారి ప్రోత్సాహంతో స్నేహ సంధ్య సంస్థ ద్వారా ఆశ్రమానికి నిత్యవసర వస్తువులు అందిస్తున్నందుకు సంస్థవారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment