Skip to main content

ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని రక్షక దేవతగా విశాఖ వాసులు కొలుస్తారని విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు

విశాఖపట్నం జగదాంబ జంక్షన్  ఎల్లమ్మ తోటలో కొలువైన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు గత ఫిబ్రవరి నెల 26వ తేదీన ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా అమ్మవారి దేవాలయం దగ్గర ఆదివారం సుమారు 5000 మంది భక్తులకు ఎల్లమాంబ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ  కార్యక్రమానికి అతిధిగా సీతంరాజు సుధాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డన చేసారు. ఈ సందర్భంగా సీతంరాజు మాట్లాడుతూ భక్తుల కోరికలను తీర్చే శక్తి స్వరూపిణిగా, స్థానికులకు ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఎల్లమ్మ అమ్మవారి పురాతన దేవాలయం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు  కొణతాల శ్రీనివాస్,ఎల్లమ్మ యువజన సంఘం సభ్యులు ఎల్లాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...