ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి :ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం.. పదవీ కాలం ముగుస్తున్న సర్పంచులకు ఘనంగా సన్మానం...
అల్లవరం, విశాఖ సందేసం.మండలంలో అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు సూచించారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి గౌరీ కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది. ఎంపీపీ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై అధికారులు వివరించాలని కోరారు. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి రూ. 50 లక్షలు నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుందని పంచాయతీ రాజ్ అధికారి సమావేశంలో వివరించారు. అల్లవరం ఎంపీటీసీ సభ్యురాలు నిచ్చెనకోళ్ల మౌనిక మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ రాజ్ అధికారులు చేస్తున్న అభివృద్ధి పనులపై కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని నిలదీశారు. గృహ నిర్మాణ శాఖలో ఎటువంటి గృహాలు మంజూరు కాలేదని, సర్వే చేసి గృహాలపై నివేదికను ఉన్నత అధికారులకు పంపామని తెలిపారు. డ్రైన్స్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సునీత మాట్లాడుతూ పలు డ్రైన్ మరమ్మతులు చేపట్టామని వివరించారు.ఆక్వా చెరువులు సాగు చేస్తున్న రైతులు సజ్జు డ్రైన్ లోకి తోడేస్తున్నారని మీరు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నించారు. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను బట్టి నోటీస్ లు ఇచ్చామని అన్నారు. తహసీల్దార్ నరసింహరావు మాట్లాడుతూ అర్హులైన ప్రజలలు
కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలన్నవారు. యాడింగ్ చేసుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ బెండమూర్లంక హాస్పిటల్ లో 31 మందికి వైద్య పరీక్షలు చేయగా ఒక క్యాన్సర్ కేసు నమోదు అయ్యిందని తెలిపారు. విద్యాశాఖ అధికారి కిరణ్ బాబు మాట్లాడుతూ పదవతరగతి పరీక్ష మండలంలో 590 మంది విద్యార్ధులు పరీక్షకు హారవుతున్నారని ,అల్లవరం,కొమరగిరిపట్నం ,దేవగుప్తం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. సర్పంచుల పదవి కాలం ఏప్రిల్ 2 తో ముగియనుండడంతో సర్పంచులకు జడ్పీటీసీ కొనుకు గౌతమి, ఎంపీపీ శేషగిరిరావు, వైస్ ఎంపీపీ ఎంపీటీసీ వడ్డి గంగా, ముత్యాల రామకృష్ణ చేతులు మీదుగా దుస్సాలువాలు కప్పి పుష్పగుచ్చలను అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలన అధికారి శర్మ, సర్పంచులు రాకాపు విజయలక్ష్మి, తోట శ్రీదేవి, రొక్కాల విజయలక్ష్మి, బొమ్మి బాలవేణి, వడ్డి సుభాషిణి, చిట్నీడి శ్రీదేవి, బర్రె సితారత్నం, మల్లాడి మంగయమ్మ, సాధానాల వెంకటరావు, దాకారపు చిరంజీవి, రాయుడు విష్ణు, సాయి, కట్టా గంగచలం, తిక్కిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీలు మౌనిక, కాండ్రేగుల వాణి అచ్యుతం, మామిడిశెట్టి శ్రీనివాసరావు, గుబ్బల రంగనాధ్ స్వామి, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment