Skip to main content

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చు : సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి..... పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లును పంపిణీ

 అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలంలోని బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి చేతుల మీదుగా మంగళవారం పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని, చిన్న చిన్న వ్యాధులు బారిన పడినప్పుడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రోళ్ళ శ్రీను, పాలకవర్గ సభ్యులు ఓలేటి పరమేశ్వరరావు, చింతం శ్రీను, దొమ్మేటి రాధాకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ సాపే సత్యనారాయణ, రాపాక సౌమ్య, నల్లి విజయ, ఎంఎల్ హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది,ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...