సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ కె.వి.ఎల్. పృథ్విలా గారు 2022 సంవత్సరంలో ఎమ్.ఎస్.సి సైకాలజీలో డిస్టింక్షన్‌తో ప్రథమ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన కాన్వొకేషన్‌లో గౌరవనీయ గవర్నర్ గారి చేతుల మీదుగా డిగ్రీ స్వీకరించారు.
ఇంకా ఆమె తన ప్రతిభను చాటుతూ ఏపీ ఆర్‌సెట్‌లో కూడా ప్రథమ ర్యాంక్ సాధించడం విశేషం.
సెయింట్ జోసెఫ్ కళాశాలలో డిగ్రీ సైకాలజీ పూర్తి చేసి, అదే సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, అలాగే ఎన్‌సీసీ అధికారిగా బాధ్యతలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని పీ ఆర్వో డా. పి.కె. జయలక్ష్మి గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక వర్గం ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు

Comments
Post a Comment