ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలి: మాజీ ఎమ్మెల్సీ ఐ. వి ..... ఆయిల్ మీద పెత్తనం కోసం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం
అమలాపురం, విశాఖ సందేసం...సామ్రాజ్యవాదం నశించాలని, ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని, ప్రజలు, కార్మికులు, రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ శనివారం వామపక్షాలు ,ప్రజా సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం వద్ద ఆందోళన చేపట్టారు. యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అని భారీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ.. ఆయిల్ మీద పెత్తనం కోసం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నాయని, దీన్ని తక్షణం ఆపాలని, లేనిపక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. మన దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రధాని మోడీ అమెరికాకు అనుగుణంగా వ్యవహరించడం నష్టదాయకమని తెలిపారు. యుద్ధం వల్ల ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయని, భవిష్యత్తులో పశ్చిమ ఆసియా నుండి దిగుమతి అయ్యే ప్రతి సరుకు ధరా పెరిగే అవకాశముందని చెప్పారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ గడియార స్తంభం సెంటర్ వద్ద నిరసన తెలిపారు. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ ఇరాన్ పై దాడులు చేసి ఆ ప్రాంతంలో తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి దిగాయని చెప్పారు. పాఠశాలలు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమాయక ప్రజానీకంపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే యుద్ధాన్ని విరమించి, శాంతియుత పద్ధతిలో పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఏపీఆర్పిఏ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వరరావు,సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. దుర్గాప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సికిలే సూర్యనారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు తాడి శ్రీరామ్మూర్తి, పాము బాలయ్య, బి.పర్వతాలు, పి .శివ,
కౌలు రైతు సంఘం రైతు సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, జిల్లా నాయకులు బుంగ సత్యనారాయణ,ఎస్ఎఫ్ఐ నాయకులు కే. శంకర్ ఐద్వా జిల్లా అధ్యక్షులు జి. దైవ కృప, అంగన్వాడి జిల్లా కోశాధికారి పి. అమూల్య,, ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు విజయ కుమారి, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ శెట్టి బత్తుల తులసి రావు, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్,, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బి.ఈశ్వరి, కె. హుస్సేన్, మొయూనుద్దీన్, అజయ్ కుమార్, డి.సతీష్, బొమ్మి ప్రశాంత్ కుమార్, సిహెచ్ రాము,ఐద్వా, సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment