Skip to main content

గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి. గన్నవరం నూతన పంచాయతీ భవనం ప్రారంభోత్సవం

గన్నవరం, విశాఖ సందేసం....కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పి. గన్నవరం శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి. గన్నవరం మండలంలోని  గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం 

పి. గన్నవరం గ్రామంలో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజల డబ్బును వృథా చేస్తూ అనేక అభివృద్ధి పనులను ప్రారంభించి మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను ప్రాధాన్యంగా తీసుకుని, అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు మరియు ఇతర ప్రభుత్వ భవనాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తికావడం వల్ల గ్రామస్థులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతాయని, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్.వి. వి సత్యనారాయణ మూర్తి (చంటి)  కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...