Skip to main content

అమలాపురంలో మెకానిక్, ఆటోమొబైల్ షాపులు బంద్...... సీనియర్ మెకానిక్ సూర్య ప్రకాశరావు మృతికి సంతాపం...

అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురంలోని శ్రీ సిద్ది వినాయక మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ మెకానిక్ కాండ్రేగుల సూర్య ప్రకాశరావు  అకాల  మరణం చెందారు. సీనియర్ మెకానిక్  సూర్య ప్రకాష్ మెకానిక్స్ యూనియన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.ప్రకాశరావు మృతి పట్ల మెకానిక్స్ యూనియన్ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

అమలాపురం పట్టణం మరియు రూరల్ మండలం పరిధిలో   మెకానిక్ షాపులతో పాటు టూ వీలర్ ఆటో మొబైల్ షాపులు సైతం అన్నీ మూసివేసి పూర్తి బంద్ పాటించారు. అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో జరిగిన సంతాప సభలో ప్రకాశరావు  చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించి  మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సాధనాల సత్తిబాబు, పట్నాల రమణ, కాండ్రేగుల కృష్ణ, నల్లా శ్రీనివాస్, గోకరకొండ పూర్ణ బాల, గుమ్మళ్ళ శ్రీను, కూర్మా నరసింహరావు, పెదపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...