Skip to main content

జోనల్ ప్రశిక్షణ విజయవంతం... ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్*

అమరావతి...బిజెపి మూల సిద్ధాంతం అందించడానికి ప్రశిక్షణ మండల స్థాయిలో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు 

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా జోనల్ వారీగా నిర్వహించిన ప్రశిక్షకుల శిక్షణా తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి.

త్వరలో చేపట్టనున్న మండల స్థాయి ప్రశిక్షణా కార్యక్రమాల పూర్వ తయారీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రశిక్షణ కమిటీతో, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav  గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ Madhukar Nukala గారు సమీక్ష సమావేశం నిర్వహించారు 

సంఘటిత శక్తితో, సిద్ధాంత బలంతో, సేవా భావంతో పార్టీ బలోపేతం దిశగా ముందుకు అడుగు వేయాలని సమీక్ష సమావేశం లో మాధవ్ పేర్కొన్నారు.

మండల స్థాయిలో ప్రశిక్షణ కోసం ముందు గా ప్రణాళిక లు రచించుకుని తేదీలు ఖరారు చేసుకోవాలన్నారు. సమీక్ష లో రాష్ట్ర ప్రశిక్షణ బృందం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కోడూరి లక్ష్మీనారాయణ,ఓబిసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్, ఐటి సెల్ ఇంఛార్జి శివా మకుటం,గాలిపుష్ఫలత తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...