Skip to main content

అంతర్జాతీయ పారిశ్రామిక ఇంజనీరింగ్ ఉత్పత్తుల ప్రదర్శన

విశాఖపట్నం 26 మార్చి 2026: పారిశ్రామిక నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. స్థానిక బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలస్ నందు మార్చి 27, 28, 29 తేదీలలో మూడు రోజులు పాటు పారిశ్రమిక మరియు ఇంజినీరింగ్ రంగాలలో వ్యాపార అవకాశాలు కల్పించే వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శనను ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు PHDCCI మరియు వైజాగపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వారి సహకారంతో ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రదర్శనలో పరిశ్రమల భవిష్యత్తు మార్గదర్శకాలు, పారిశ్రామిక రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన మరియు నవీన ఆవిష్కరణలు గురించి పరిశ్రమల నిపుణులు మరియు ఔత్సాహికులు తెలుసుకొనుటకు అవకాశం కలుగుతుంది.
   ఈ ప్రదర్శనలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతా, నాగ్‌పూర్ మరియు విజయవాడ వంటి నగరాల నుండి దేశవ్యాప్తంగా నున్న సుమారు  70 మందికి పైగా పరిశ్రమల వారు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మెషిన్ టూల్స్, బేరింగ్‌లు, స్విచ్‌గేర్‌లు, వెల్డింగ్ పరికరాలు, పవర్ టూల్స్, హ్యాండ్ టూల్స్, కటింగ్ టూల్స్, శాస్త్రీయ పరికరాలు, ల్యాబ్ పరికరాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి ఉత్పత్తులు, భద్రతా ఉత్పత్తులు, నిర్వహణ ఉత్పత్తులు తోపాటు మరెన్నో వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన సందర్శనకు సుమారు 10,000 మంది వస్తారని ఆశిస్తున్నారు. నూతనంగా పారిశ్రామిక రంగంలోనికి అడుగుపెట్టాలి అనుకునే ఔత్సాహికులకు ఈ ప్రదర్శనలో విభిన్న ఉత్పత్తులు కార్యకలాపములు, పార్తిశ్రామిక పరిజ్ఞానం, నెట్ వర్కింగ్ మరియు పారిశ్రామిక వృద్ధికి కావలసిన సమాచారం  లబ్ది చేకూరుస్తాయని నిర్వాహకులు చెపుతున్నారు.        ఈ ప్రదర్శన స్థానిక పరిశ్రమలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, వైజాగ్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమలకు అవసరమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ ఎక్స్‌పో MSME రంగానికి నెట్‌వర్కింగ్ కోసం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఎక్స్‌పోకు వచ్చే ప్రతి ఒక్కరికి వారికి తగిన  వ్యాపార అవకాశం లభిస్తుంది. ఈ ప్రదర్శనలో సుమారు రూ.25 కోట్లు పైబడిన విలువ కలిగిన 5000 యూనిట్ల వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, తైవాన్ నుండి ఒక అంతర్జాతీయ సంస్థ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తుంది. అలాగే సరఫరాదారులు, తయారీదారులు మరియు డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్టులు, ఇంటిగ్రేటర్ల మధ్య B2B సమావేశాన్ని ఈ ప్రదర్శన వేదికగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది నగరంలో కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసేందుకు విద్యార్థులు సందర్శించవచ్చును. విశాఖ

పట్నం మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ముందుకు రావాలని,  తమ ఉత్పత్తులను బ్రాండ్ ఇమేజ్‌ను ప్రచారం చేసుకోవలసినదిగా ఇండోర్ ఇన్ఫోలైన్ నిర్వాహకులు కోరుచున్నారు

ఎక్స్‌పోను ప్రారంభించేవారు :- 

ప్రదర్శన  ఉదయం 11 నుండి సాయంత్రం 7 గంటల వరకు. ప్రవేశం ఉచితం. 

వివరాలకు : ఆర్.కె.అగర్వాల్ – మేనేజింగ్ డైరెక్టర్ ( 9425054216)

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...